తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్​లో అండర్-14 వాలీబాల్ పోటీలు... - HYD

హైదరాబాద్​ ఎల్​బీ స్టేడియంలో అండర్-14 వాలీబాల్ పోటీలు ప్రారంభం. గ్రామీణ క్రీడాకారులను వెలికితీసేందుకు ప్రయత్నం.

UNDER-14

By

Published : Feb 1, 2019, 10:02 PM IST

LB STADIUM
తెలంగాణను క్రీడా హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర క్రీడ సాధికారక ఛైర్మన్‌ వెంకటేశ్వర్‌రెడ్డి చెప్పారు. త్వరలో హైదరాబాద్‌లో ఖేల్‌ ఇండియా క్రీడలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఎల్‌బీ స్టేడియంలో అండర్‌-14 ఇంటర్‌ స్కూల్‌ వాలీబాల్‌ పోటీలను ఆయన ప్రారంభించారు. పచ్చదనంలో భాగంగా గ్రౌండ్‌లో మొక్కలు నాటారు.
క్రీడల అభివృద్ధికి వచ్చే బడ్జెట్‌లో 300 కోట్ల నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రికి ఆయన విజ్ఞప్తి చేశారు.
రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలకు చెందిన 23 బాలుర టీమ్‌లు, 19 బాలికల టీమ్‌లు పాల్గొంటాయని నిర్వహకులు తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details