హరితహారం స్ఫూర్తితో యూపీలో గ్రీన్ ప్రాజెక్ట్ - up green project
కోట్లాది మొక్కలు నాటాలన్న సీఎం కేసీఆర్ సంకల్పం అత్యంత ధైర్యమని ఉత్తరప్రదేశ్ అటవీ అధికారులు ప్రశంసించారు. యూపీ గ్రీన్ ప్రాజెక్టును సమర్థంగా అమలు చేయడానికి ఇక్కడి హరితహారాన్ని అధ్యయనం చేయడానికి వారి బృందం రాష్ట్రంలో పర్యటించింది.
యూపీ గ్రీన్ ప్రాజెక్ట్ మిషన్ సంచాలకులు బివాస్ రంజన్ నేతృత్వంలోని బృందం అరణ్య భవన్లో రాష్ట్ర అటవీశాఖ అధికారులతో సమావేశమైంది. రాష్ట్రంలో చేపట్టిన పచ్చదన పెంపు ప్రణాళికలు, అటవీప్రాంతాల పునరుద్ధరణ, అర్బన్ పార్కుల అభివృద్ధి, అటవీ రక్షణ, అక్రమ రవాణా నిరోధక చర్యలు, ప్రత్యామ్నాయ మొక్కల పెంపకం తదితర అంశాలను రాష్ట్ర అధికారులు వివరించారు.
క్షేత్రస్థాయిలో హరితహారం అమలును పరిశీలించేందుకు ఉత్తర ప్రదేశ్ అధికారులు మంగళవారం గజ్వేల్, సిద్దిపేట, మెదక్ ప్రాంతాల్లో పర్యటించనున్నారు.