హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు తిరుపతి తిరుమల దేవస్థాన ప్రత్యేక అధికారి రమేశ్ బాబు తెలిపారు. బాలాజీ భవన్‌లో కొలువైన శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో... జూన్ 9 నుండి 13వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు టీటీడీ వైభవంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, దాస సాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాట ప్రదర్శనలు ఏర్పాటు చేసినట్లు రమేశ్ బాబు తెలిపారు.
హైదారాబాద్‌లో టీటీడీ వార్షిక బ్రహ్మోత్సవాలు - brahmothsavalu
హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 9 నుంచి 13 వరకు జరగనున్నాయి. ఈ మేరకు ఇవాళ ఉత్సవాల గోడ ప్రతిని టీటీడీ ప్రతినిధులు ఆవిష్కరించారు.
హైదారాబాద్‌లో టీటీడీ వార్షిక బ్రహ్మోత్సవాలు