బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టితో ముగియనున్నాయి. 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కోసం శుక్రవారం నుంచి సమావేశాలు నడుస్తున్నాయి. మొదటి రోజే ఉభయ సభల్లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. శనివారం బడ్జెట్‌పై చర్చ పూర్తయింది. ఇవాళ ద్రవ్య వినిమయ బిల్లుపై ఉభయ సభల్లోనూ చర్చించి ఆమోదిస్తారు.
ఉప సభాపతి ఎన్నిక..
మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్ రెడ్డి మృతికి శాసనసభ సంతాపం ప్రకటిస్తుంది. అనంతరం ఉపసభాపతి ఎన్నిక చేపడతారు. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కోసం కేవలం పద్మారావుగౌడ్ నామినేషన్ మాత్రమే దాఖలైంది. దీంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. ఆ తరువాత ద్రవ్య వినిమయ బిల్లుపై శాసనసభలో చర్చిస్తారు. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఆర్నెళ్ల కాలానికి 91 వేల కోట్ల రూపాయలను ప్రభుత్వానికి అనుమతించే బిల్లుపై చర్చిస్తారు. ముఖ్యమంత్రి సమాధానం అనంతరం బిల్లును ఆమోదిస్తారు.