రాష్ట్ర ఐదో ఆవిర్భావ వేడుకలకు దిల్లీలోని తెలంగాణ భవన్ ముస్తాబైంది. హస్తినలోని రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధులు మందా జగన్నాధం, వేణుగోపాల చారి, రామచంద్రు తేజావత్, తెలంగాణ భవన్ అధికారులు రెండు రోజుల ముందుగానే పనులను ప్రారంభించారు. తెలంగాణ భవన్‌కు విద్యుద్దీపాలంకరణ, పరిసర ప్రాంతాల్లో అవతరణ ప్రచార చిత్రాలతో అలంకరించారు. తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలు ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. చార్మినార్‌లోని లాడ్ బజార్‌ను తలపించేలా స్టాళ్లతో బజార్‌ను ఏర్పాటు చేశారు. తెలంగాణ వస్త్రాలు, హస్తకళలు, రాష్ట్ర వంటకాలు ఈ స్టాళ్లలో అందుబాటులో ఉన్నాయి. శనివారం ఉదయం భవన్లో రాములవారి కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దిల్లీలోని తెలుగువారు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కూచిపూడి నృత్యాలు, రామదాసు కీర్తనలు, నృత్యాలు వంటి ప్రదర్శనలు నిర్వహించారు.
దిల్లీలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు దిల్లీలోని తెలంగాణ భవన్ ముస్తాబైంది. ఐదో అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. విద్యుద్దీపాలంకరణతో తెలంగాణ భవన్ కాంతులీనుతుంది.
దిల్లీలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం
ఈ రోజు దిల్లీలో రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధులు జాతీయ జెండా ఎగురవేసి... తెలంగాణ తల్లికి పుష్పాంజలి చేయనున్నారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని తాగునీటి సదుపాయం, ఆహారం అందుబాటులో ఉంచారు.
ఇవీ చూడండి: ఆవిర్భావ వేడుకలకు ముస్తాబైన పబ్లిక్ గార్డెన్
Last Updated : Jun 2, 2019, 7:27 AM IST