కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో భద్రపరిచిన హైదరాబాద్, ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల పార్లమెంటు ఎన్నికల ఈవీఎంలను జిల్లా ఎన్నికల అధికారి దాన కిశోర్ పరిశీలించారు. స్ట్రాంగ్ రూంల్లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరినీ అనుమతించవద్దని సూచించారు. అభ్యర్థులు వస్తే... విధిగా విజిటర్స్ పుస్తకంలో సంతకంతోపాటు పరిశీలించిన అంశాలు నమోదు చేయించాలని భద్రతాధికారులను ఆదేశించారు. సీసీ కెమెరాలన్నీ పనిచేసేలా అప్రమత్తంగా ఉండాలని, అగ్నిమాపక పరికరాలు కూడా సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.
'స్ట్రాంగ్ రూంల్లోకి ఎవరినీ అనుమతించొద్దు'
పార్లమెంటు ఎన్నికల ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూంలను హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి దానకిశోర్ పరిశీలించారు. ఎలాంటి అవకతవకలు జరగకుండా జాగ్రత్త పడాలని భద్రతాధికారులకు సూచించారు.
'స్ట్రాంగ్ రూంల్లోకి ఎవరినీ అనుమతించొద్దు'