తెలంగాణ

telangana

ETV Bharat / state

పదోతరగతి అడ్వాన్స్​డ్ సప్లిమెంటరీ ఫలితాల విడుదల - ssc results

పదోతరగతి అడ్వాన్స్​డ్​ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విద్యాభవన్​లో ఇవాళ ప్రకటించారు. పరీక్షలకు హాజరైన వారిలో 53.59శాతం విద్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. జవాబు పత్రాల రీ కౌంటింగ్​కు రేపటి నుంచి ఈ నెల 15 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు.

పదోతరగతి అడ్వాన్స్​డ్ సప్లిమెంటరీ ఫలితాల విడుదల

By

Published : Jul 6, 2019, 5:29 PM IST

Updated : Jul 6, 2019, 11:39 PM IST

ఈ నెల 10 నుంచి 24 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన పదోతరగతి అడ్వాన్స్​డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు ఈరోజు విడుదల చేశారు. ఈ ఏడాది 7.57శాతం ఫెయిలవ్వగా... సప్లిమెంటరీలో సగానికి పైగా ఉత్తీర్ణులయ్యారు. 50 వేల 192 మంది హాజరు కాగా... 26 వేల 898 మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం 53.59 శాతం ఉండగా... వీరిలో 50.92 శాతం బాలురు, 57.90 శాతం బాలికలు ఉన్నారు. జగిత్యాల జిల్లాలో అత్యధికంగా 96.50శాతం... హైదరాబాద్​లో అత్యల్పంగా 34.08 శాతం మాత్రమే గట్టెక్కారు. సప్లిమెంటరీ పరీక్షల జవాబు పత్రాల రీ కౌంటింగ్ కోసం రేపటి నుంచి ఈ నెల 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల సంచాలకులు సుధాకర్ తెలిపారు.

Last Updated : Jul 6, 2019, 11:39 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details