ఇంకా ఏం చేయాలంటారూ..?
రైలు ప్రయాణం ఎలా ఉంది... సౌకర్యాలు బాగున్నాయా... ఎమన్నా సలహాలు ఇవ్వొచ్చుకదండీ... అంటూ దక్షిణ మధ్య రైల్వే కొత్త జనరల్ మేనేజర్ ప్రయాణికులతో ముచ్చటించారు.
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మ్యా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి హైదరాబాద్‌లో పర్యటించారు. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి లింగంపల్లి వరకు ఎంఎంటీఎస్‌లో ప్రయాణించారు. రైళ్ల నిర్వహణ గురించి ప్రయాణికులను అడిగి, మెరుగుపర్చేందుకు సలహాలు, సూచనలు స్వీకరించారు.
లింగంపల్లి స్టేషన్లో ప్రాంగణమంతా తిరుగుతూ... ప్రయాణికుల వసతి, సౌకర్యాలు, ఎస్కలేటర్ పనులు, బుకింగ్ కార్యాలయ విస్తరణ, కేటరింగ్ స్టాళ్లు, పార్కింగ్ స్థలాన్ని పర్యవేక్షించారు. హైటెక్ సిటీ, బేగంపేట్, ఫలక్‌నుమా స్టేషన్లను పరిశీలించారు. రైల్వే కోచ్‌లోని సౌకర్యాలు మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచనలిచ్చారు.
ఇవీ చూడండి:సంఝౌతా పునఃప్రారంభం