సామాజిక మాధ్యమాల్లో తనను వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నటి పూనమ్ కౌర్ హైదరాబాద్ సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు. గుర్తు తెలియని కొందరు తన పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని... తన గురించి సదరు వ్యక్తులపై వ్యాఖ్యానించడానికి వారికి ఏ అధికారం ఉందని ఆమె ప్రశ్నించారు. పోలీసులపై తనకు పూర్తి నమ్మకం ఉందని దోషులు ఎవరైనా సరే కఠిన చర్యలు తీసుకోవాలని పూనమ్ కౌర్ విన్నవించారు.
'మీ రాజకీయాలకు నన్ను బలి చేయొద్దు'
వర్ధమాన సినీ నటి పూనమ్ కౌర్ తనపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న దుష్ప్రచారాలపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనపై తప్పుడుగా వ్యాఖ్యానిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
'మీ రాజకీయాలకు నన్ను బలి చేయొద్దు'