ట్రాఫిక్ కానిస్టేబుల్ అసదుద్దీన్ ఓవైసీ - old city
ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ట్రాఫిక్ కానిస్టేబుల్ అవతారం ఎత్తారు. పాతబస్తీలోని ఫతేదర్వాజ వద్ద ఇవాళ ఉదయం ట్రాఫిక్ పెరిగిపోయి అరగంట పాటు వాహనాలు నిలిచిపోయాయి. అటుగా వెళ్తున్న అసదుద్దీన్ స్వయంగా రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
ట్రాఫిక్ కానిస్టేబుల్ అసదుద్దీన్ ఓవైసీ
పాతబస్తీ ఫతేదర్వాజా వద్ద హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కారు దిగి ట్రాఫిక్‌ను కంట్రోల్ చేశారు. ట్రాఫిక్ పోలీసులు లేక ఉదయం అరగంట పాటు వాహనాలు నిలిచిపోయాయి. అటువైపు నుంచి వెళ్తున్న అసద్ తానే స్వయంగా ట్రాఫిక్ కానిస్టేబుల్ అవతారం ఎత్తారు. చౌరస్తాలో సిగ్నల్ లేకపోవడం వల్ల నిలిచిపోయిన ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
Last Updated : Jun 1, 2019, 3:42 PM IST