తెలంగాణ

telangana

ETV Bharat / state

కొత్తవి నిర్మించారు... పాతవి అక్కడే ఉంచారు - open

రాబోయే వర్షాకాలన్ని దృష్టిలో ఉంచుకుని జీహెచ్​ఎంసీ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రజలు ఇబ్బంది పడకుండా పలు చోట్ల పాత మాన్​హోల్స్​​ స్థానంలో కొత్తవి నిర్మిస్తున్నారు. పాత వాటిని అక్కడే వదిలేయడం వల్ల  వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

నిర్మించకుండా ఉన్న గుంత

By

Published : May 21, 2019, 11:08 AM IST

జంటనగరాల్లో నగర పాలక సంస్థ ముందుస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని శిథిలావస్థలో ఉన్న మాన్​హోల్స్​​ను తొలగించి వాటి స్థానంలో కొత్త వాటిని నిర్మిస్తోంది. రోడ్లమీద మాన్​హోల్స్ కొత్తగా నిర్మిస్తున్నప్పటికీ పాత వాటిని అక్కడే వదిలేయడం వల్ల వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సికింద్రాబాద్ తుకారం గేట్​లోని మెయిన్ రోడ్డుపై నిర్మించిన కొత్త మాన్​హోల్స్​ కొన్నింటికి సిమెంట్ వేయకుండానే వదిలేశారు. మరికొన్నింటి వద్ద గుంతలు తవ్వి వదిలేశారు. వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బంది కలుగుతోందని చెబుతున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకుని పాతవాటిని తొలగించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

కొత్తవి నిర్మించారు... పాతవి అక్కడే ఉంచారు
ఇవీ చూడండి: దిల్లీలో నేడు విపక్షాల నేతల కీలక సమావేశం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details