చికిత్స అందించట్లేదంటూ నిమ్స్ వైద్యుడిపై దాడి
నిమ్స్ ఆసుపత్రిలో వైద్యులు సరిగ్గా వైద్యం అందిచలేదని రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి బంధువులు ఆందోళన చేశారు. వైద్యుడితో దుర్భాషలాడుతూ హంగామా సృష్టించారు.
వైద్యం సరిగా చేయడం లేదంటూ హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో రోగి బంధువులు డాక్టర్తో వాగ్వాదానికి దిగారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ తమ వ్యక్తికి చికిత్స అందించట్లేలేదంటూ ఎమర్జెన్సీ వార్డు వద్ద హంగామా సృష్టించారు. విధుల్లో ఉన్న వైద్యుడిపై చేయి చేసుకున్నారు. దీంతో ఆసుపత్రి సిబ్బంది, రోగులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని అక్కడి నుంచి పంపించారు. రాత్రి విధుల్లో ఉన్న డాక్టర్ స్పందిచలేదని రోగి బంధువులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి సిబ్బంది ఫిర్యాదు ఇస్తే కేసు నమోదు చేస్తామని పంజాగుట్ట పోలీసులు తెలిపారు.