తెలంగాణ

telangana

ETV Bharat / state

పేలిన స్మార్ట్​ఫోన్​... యువకుడికి తీవ్రగాయాలు - mlast

రాత్రంతా మీ సెల్​ఫోన్​కు ఛార్జింగ్​ పెడుతున్నారా...? ఫోన్​ వేడెక్కుతున్నా వినియోగిస్తున్నారా..? ఎండా కాలం వచ్చేసింది.. ఇక మీరు జాగ్రత్తగా ఉండక తప్పదు. ఎందుకంటే ఇప్పుడు మీ చేతిలో ఉంది కేవలం చరవాణి మాత్రమే కాదు..  ఏ క్షణమైనా పేలే బాంబు.

రాత్రంతా మీ సెల్​ఫోన్​కు ఛార్జింగ్​ పెడుతున్నారా...?

By

Published : Mar 26, 2019, 1:27 PM IST

రాత్రంతా మీ సెల్​ఫోన్​కు ఛార్జింగ్​ పెడుతున్నారా...?
సికింద్రాబాద్‌ మచ్చబొల్లారంలో ప్రమాదవశాత్తు ఓ సెల్‌ఫోన్ పేలింది. లాల్​బజారులో నివాసముంటున్న ఓ యువకుడు పరీక్ష రాసేందుకు వెళ్తూ చరవాణిని ప్యాంటు జేబులో పెట్టుకున్నాడు. ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఒక్కసారిగా ఫోన్​ పేలింది. యువకుడు బైక్​ మీద నుంచి కింద పడ్డాడు. గాయాలైన యువకుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

ఫోన్​ కొన్న రెండు రోజులకే...

స్మార్ట్​ఫోన్​ కొనుగోలు చేసి రెండురోజులే అయిందని యువకుడి తండ్రి వాపోయాడు. ఫోన్​ డీలర్​ను వివరణ అడిగితే తమకు సంబంధం లేదన్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. కొత్తగా కొన్న ఫోన్​ పేలడంపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

జాగ్రత్తలు తీసుకోవాల్సిందే...

సాధారణంగానే స్మార్ట్​ఫోన్లు కాసేపు వినియోగించినా వేడెక్కుతుంటాయి. ఎండాకాలంలో ఈ ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఫోన్​ వేడెక్కినప్పుడు ఉపయోగించకపోవడమే ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. ప్యాంటు జేబులో గాని, పై జేబులో పెట్టుకున్నప్పుడు ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తే గుండెతో పాటు ఇతర శరీరభాగాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని.. ఒక్కోసారి ప్రాణహాని కూడా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

ఇవీ చూడండి:భారతీయుల్లో ఏటేటా పెరుగుతున్న అసంతృప్తి!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details