తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం ఎల్లుండే.. - mim

నూతనంగా ఎన్నికైన ఆరుగురు ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి శాసన మండలి తేదీని ఖరారు చేసింది. సోమవారం ఉదయం మండలి ఇన్​ఛార్జి ఛైర్మన్​ నేతి విద్యాసాగర్​ వారితో ప్రమాణం చేయించనున్నారు.

సోమవారం ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం

By

Published : Apr 13, 2019, 6:19 AM IST

Updated : Apr 13, 2019, 8:29 AM IST

సోమవారం ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం

తెలంగాణ శాసనమండలి కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం ఈ నెల 15న చేయనున్నారు. మండలి ఇన్​ఛార్జి ఛైర్మన్​ నేతి విద్యాసాగర్​ వారితో ప్రమాణం చేయిస్తారు. శాసన సభ్యుల కోటా కింద హోం మంత్రి మహమూద్​ అలీ, శేరి సుభాష్​ రెడ్డి, సత్యవతి రాథోడ్​, ఎగ్గె మల్లేషంలు తెరాస తరఫున.. మీర్జా రియాజ్​ హసన్​ ఎంఐఎం తరఫున గెలుపొందారు. నల్గొండ- వరంగల్-ఖమ్మం ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎ. నర్సిరెడ్డి విజయం సాధించారు. కరీంనగర్​- మెదక్​- నిజామాబాద్​- అదిలాబాద్​ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి జీవన్​ రెడ్డి గెలుపొందారు. సోమవారం వీరి ప్రమాణ స్వీకారం కోసం శాసనమండలి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇవీ చూడండి:అవినీతి, అలసత్వం రూపుమాపేలా చట్టాలు: కేసీఆర్​

Last Updated : Apr 13, 2019, 8:29 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details