తెలంగాణ

telangana

ETV Bharat / state

భాగ్యనగర సంగీత ప్రియులకు 'సునీత'స్వరాలు - poster

హైదరాబాద్ సంగీత ప్రియులను అలరించేందుకు సినీ నేపథ్య గాయని సునీత ఆలపించనున్నారు. మెలోడియస్ మూమెంట్స్ విత్ సునీత పేరుతో ఆగస్టు 4న శిల్పకళావేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

భాగ్యనగర సంగీత ప్రియులకు 'సునీత'స్వరాలు

By

Published : Jul 19, 2019, 5:35 PM IST

ప్రముఖ సినీ నేపథ్య గాయని సునీత భాగ్యనగర సంగీత ప్రియులను తన సుమధుర సంగీత స్వర ఆలపనతో ఓలలాడించానున్నారు. ఈవెంట్‌ ఎలెవెన్‌ ఆధ్వర్యంలో 'మెలోడియెస్‌ మూమెంట్స్‌ విత్‌ సునీత' పేరిట ఆగస్టు 4న మాదాపూర్‌లోని శిల్పాకళావేదికలో సంగీత కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను ఇవాళ జూబ్లీహిల్స్‌లోని ఓ హోటల్‌లో ఈవెంట్‌ ఎలెవెన్‌ ప్రతినిధులతో కలిసి గాయని సునీత ఆవిష్కరించారు.

25 ఏళ్ల తన సంగీత ప్రయాణంలో తొలిసారిగా భారీ స్థాయిలో సంగీత కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు సునీత. ఈ కార్యక్రమంలో తనతో పాటు పియానో ప్రాడిజీ, చెన్నైకి చెందిన 13 ఏళ్ల లిడియాన్‌ నాదస్వరంతో సంగీత ప్రియులను అలరిస్తాయని ఆమె తెలిపారు. పూర్తిగా పాత, కొత్త కలియిగా సంగీత కార్యక్రమం ఉంటుందని ఆమె వివరించారు.

భాగ్యనగర సంగీత ప్రియులకు 'సునీత'స్వరాలు

ఇవీ చూడండి: కొత్త పురపాలక చట్ట ముసాయిదా బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

ABOUT THE AUTHOR

...view details