ప్రజాస్వామ్యం ఇవాళ నడి బజార్లో హత్య చేయబడిందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కుసుమ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేయాలని గతంలోనే సభాపతిని కోరినట్లు తెలిపారు. అనర్హత పిటిషన్లు హైకోర్టులో, సభాపతి వద్ద పెండింగ్లో ఉండగా ఇప్పుడు విలీన నిర్ణయం తీసుకోవడం చట్టవిరుద్ధమన్నారు. అభద్రతాభావంతోనే కేసీఆర్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు.
'నేడు ప్రజాస్వామ్యం నడి బజార్లో హత్యకు గురైంది'
సీఎల్పీని తెరాసలో విలీనం చేయడం రాజ్యంగ విరుద్ధమని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కుసుమ కుమార్ అన్నారు. ఈరోజు ప్రజాస్వామ్యానికి దుర్దినంగా అభివర్ణించారు.
'నేడు ప్రజాస్వామ్యం నడి బజార్లో హత్యకు గురైంది'