మూడు రోజుల పాటు జనసాధారణ్ రైళ్లు - scr
దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం మూడు రోజులపాటు జనసాధారణ్ రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. విజయవాడ నుంచి రేణిగుంట, విజయనగరం, సికింద్రాబాద్ నుంచి విజయనగరంనకు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు.
దక్షిణ మధ్య రైల్వే విజయవాడ-రేణిగుంట, విజయవాడ-విజయనగరం, విజయనగరం-సికింద్రాబాద్ మధ్య వేసవిలో జనసాధారణ్ రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రజా సంబంధాల అధికారి రాకేష్ తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ రైళ్లు నేటి నుంచి మూడు రోజులపాటు అందుబాటులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఈ జనసాధారణ్ రైళ్లలో ఎక్కువ మంది ప్రయాణికులు ప్రయాణించేలా 18 రెండవ తరగతి సాధారణ బోగీలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. వీటితో పాటు ప్రతి రైలుకు రెండు రవాణా, బ్రేక్ వ్యాన్ కోచ్‌లను అనుసంధానం చేశామని తెలిపారు.