రాష్ట్రంలో ఇవాళ, రేపు ఓటర్లను ప్రభావితం చేసేందుకు నగదు అక్రమ ప్రవాహం జరిగే అవకాశం ఉన్నందున ఆదాయపన్ను శాఖ అప్రమత్తమైంది. పోలీసు, రెవెన్యూ శాఖల ప్రత్యేక బృందాలతోపాటు ఐటీ టీమ్స్ కూడా నిఘా పెంచాయి. ఉమ్మడి పది జిల్లాలకు ఒక్కోక్క బృదం చొప్పున పది బృందాలు పని చేస్తున్నట్లు ఆదాయపన్ను అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా... వేగులు నుంచి అందించే సమాచారం ఆధారంగా సోదాలు నిర్వహించనున్నారు. డబ్బు పంపిణీ చేసి ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేవారే లక్ష్యంగా ఈ బృందాలు పని చేస్తున్నాయని ఆ శాఖ అధికారులు తెలిపారు.
ఆదాయపన్ను శాఖ డేగ కన్ను - income tax
సార్వత్రిక ఎన్నికలకు మరికొన్ని గంటలే గడవు ఉన్న నేపథ్యంలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు నగదు అక్రమ రవాణా జరిగే అవకాశం ఉన్నందున ఆదాయపన్ను శాఖ రాష్ట్రంపై దృష్టి కేంద్రీకరించింది.
ఆదాయపన్ను శాఖ డేగ కన్ను