ఇంటర్ పాసయిన విద్యార్థుల పునఃపరిశీలన, పునఃలెక్కింపు ఫలితాలను ఇంటర్మీడియట్ బోర్డు ఇవాళ ప్రకటించింది. ఫెయిలైన విద్యార్థులందరికీ ఇంటర్ బోర్డు ఉచితంగా జవాబు పత్రాలను రీవెరిఫికేషన్ చేసింది. అయితే కొందరు తాము పాసైనప్పటికీ... తక్కువ మార్కులు వచ్చాయంటూ ఫీజు చెల్లించి పునఃపరిశీలన లేదా పునఃలెక్కింపునకు దరఖాస్తు చేసుకున్నారు. సుమారు 40వేల మంది విద్యార్థులకు సంబంధించిన దాదాపు 84 వేల జవాబు పత్రాలను రీవెరిఫికేషన్ లేదా రీకౌంటింగ్ చేసి ఫలితాలను వెబ్ సైట్లో ప్రకటించింది. అయితే సుమారు 8వేల జవాబు పత్రాల స్కానింగ్, అప్లోడ్ ప్రక్రియ పూర్తి కానందున... వాటి ఫలితాలను ఇంకా విడుదల చేయలేదని ఇంటర్ బోర్డు తెలిపింది.
ఇంటర్ రీవెరిఫికేషన్ ఫలితాలు విడుదల
తెలంగాణ ఇంటర్ బోర్డు ఇవాళ రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఫలితాలు విడుదల చేసింది. దరఖాస్తు చేసుకున్న వారి జవాబు పత్రాలు కూడా ఆన్లైన్లో ఉంచినట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. మరో 8 వేల జవాబు పత్రాల అప్లోడింగ్ పెండింగ్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఇంటర్ రీవెరిఫికేషన్ ఫలితాలు విడుదల
Last Updated : May 31, 2019, 11:08 PM IST