తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలుగు రాష్ట్రాల్లో ఐటీ శాఖ తనిఖీలు

ఆదాయపు పన్ను శాఖ రెండు తెలుగు రాష్ట్రాల్లో సోదాలు ముమ్మరం చేసింది. పెద్ద సంఖ్యలో బృందాలుగా ఏర్పడి గత రెండు నెలలుగా అసెస్మెంట్​ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఆర్థిక ఏడాదిలో చివరి మూడు నెలలు సోదాలు చేయడం వల్ల పెండింగ్​ ఆదాయపన్ను వసూలవుతోంది.

By

Published : Mar 23, 2019, 10:04 AM IST

Updated : Mar 23, 2019, 4:05 PM IST

ఆదాయపు పన్ను శాఖ అధికారుల తనిఖీలు

ఆదాయపు పన్ను శాఖ అధికారుల తనిఖీలు
కొద్దిరోజులుగా ఆదాయపు పన్ను శాఖ తెలుగు రాష్ట్రాల్లో తనిఖీలు, ఆడిటింగ్​లు నిర్వహిస్తోంది. పన్ను చెల్లిస్తున్న సంస్థలు లేదా వ్యక్తులు నివేదించే పత్రాలు... వాస్తవిక ఆదాయమో కాదో బేరీజు వేసేందుకు ఈ అసెస్మెంట్​ తనిఖీలు నిర్వహిస్తున్నారు. గత రెండు నెలలుగా... అధికారులు పెద్ద సంఖ్యలో బృందాలుగా ఏర్పడి సోదాలు కొనసాగిస్తున్నారు.

ఏటా నిర్వహిస్తారు...

ప్రతి సంవత్సరం ఆర్థిక ఏడాది చివరి మూడు నెలలు ప్రణాళికాబద్ధంగా తనిఖీలు కొనసాగుతాయని ఆదాయపన్ను శాఖ అధికారులు వివరించారు. ఇలా చేయడం వల్ల పెండింగ్​ పన్ను వసూలు అవుతుంది. అలాగే తేడా ఉన్న పన్ను వసూలు చేసేందుకు అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండిః షీ టీమ్​ సేవల అవగాహనపై 2కె పరుగు

Last Updated : Mar 23, 2019, 4:05 PM IST

ABOUT THE AUTHOR

...view details