తెలంగాణ

telangana

ETV Bharat / state

పంచాయతీల విలీనం పిటిషన్లు కొట్టివేత - MERGING

పంచాయతీలను కార్పొరేషన్లు, పురపాలక సంఘాల్లో కలపోద్దంటూ వందకు పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. పిటిషనర్లు, ప్రభుత్వ వాదనలు విన్న న్యాయస్థానం అన్ని వ్యాజ్యాలను కొట్టేసింది.

అభివృద్దికే మొగ్గు...

By

Published : Mar 8, 2019, 11:37 PM IST

అభివృద్దికే మొగ్గు...
రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో పలు పంచాయతీలను విలీనం చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను హైకోర్టు కొట్టేసింది. నగరాలు, పట్టణాల్లో పంచాయతీల విలీనంపై దాఖలైన 127 పిటిషన్లపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం ఇవాళ తీర్పు వెలువరించింది. నిబంధనలకు విరుద్ధంగా పంచాయతీలను పట్టణాల్లో కలిపేస్తూ సర్కారు ఏకపక్షంగా ఉత్తర్వులు జారీ చేసిందని పిటిషనర్లు వాదించారు.

పట్టణీకరణ జరిపిన గ్రామాలనే విలీనం చేశామని... మరింత వేగంగా అభివృద్ధి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వాదించింది. చట్టాలు, నిబంధనలకు లోబడే ఉత్తర్వులు జారీ చేశామని పేర్కొంది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం... 127 వ్యాజ్యాలను కొట్టేసింది.

ABOUT THE AUTHOR

...view details