తెలంగాణ

telangana

ETV Bharat / state

తొలగిన అడ్డంకి... పారెస్టు బీట్ అధికారులకు లైన్​ క్లియర్ - clearence

అటవీశాఖలో ఫారెస్టు బీట్ అధికారుల నియామకాలకు మార్గం సుగమమైంది. ఇవాళ హైకోర్టు స్టే ఎత్తివేసింది. ఇప్పటికే ఫారెస్టు రేంజ్, సెక్షన్ ఆఫీసర్ల శిక్షణ పూర్తి కాగా... బీట్ అధికారులకు శిక్షణ ఇచ్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

తొలగిన అడ్డంకి... పారెస్టు బీట్ అధికారులకు లైన్​ క్లియర్

By

Published : Jul 3, 2019, 8:33 PM IST

Updated : Jul 3, 2019, 11:32 PM IST

అటవీశాఖలో 1,857 మంది ఫారెస్ట్ బీట్ అధికారుల నియామకాలకు హైకోర్టు అనుమతించింది. పోస్టుల నియామకంపై ఉన్న స్టే హైకోర్టు ఎత్తివేతతో ఎంపికైన వారు విధుల్లోకి చేరేందుకు మార్గం సుగమమైంది. ఇప్పటికే రేంజ్, సెక్షన్ ఆఫీసర్ల శిక్షణ పూర్తి కాగా... బీట్ అధికారులకు కూడా శిక్షణ ఇచ్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

67 ఫారెస్ట్ రేంజ్ అధికారులు, 90 ఫారెస్ట్ సెక్షన్ అధికారులు, 1,857 బీట్ అధికారుల నియామకం చేపట్టినందుకు ముఖ్యమంత్రికి అటవీ సంరక్షణాధికారి ప్రశాంత్ కుమార్ ఝా, అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ దశాబ్దాలుగా ఇంత పెద్దఎత్తున నియామకాలు చేపట్టలేదని, ఈ నియామకాలతో వందశాతం సిబ్బంది అందుబాటులోకి రానున్నట్లు అధికారులు వెల్లడించారు.

తొలగిన అడ్డంకి... పారెస్టు బీట్ అధికారులకు లైన్​ క్లియర్

ఇదీ చూడండి: శ్రీచైతన్య టెక్నో స్కూల్​పై ఎన్​ఎస్​యూఐ దాడి

Last Updated : Jul 3, 2019, 11:32 PM IST

ABOUT THE AUTHOR

...view details