రైతులకు చెల్లించేందుకు 150 కోట్లా 17 లక్షల రూపాయలు ప్రభుత్వం విడుదల చేసింది. మద్దతు ధరతో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి ఒక్క రూపాయి కూడా బకాయి లేకుండా చెల్లించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆ మేరకు నిధులు విడుదల చేసినట్లు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
రైతులకు చెల్లించేందుకు నిధులు విడుదలచేసిన ప్రభుత్వం
రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. జొన్న, శనగ, మినుములు, పొద్దుతిరుగుడు రైతులకు బకాయిలు చెల్లించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. రైతుల ఖాతాల్లో జమచేయనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి తెలిపారు.
రైతులకు చెల్లించేందుకు నిధుల విడుదల