"కేటీఆర్ అన్న నన్ను కాపాడుండ్రి.. సౌదీలో నన్ను సంపుతుండ్రు. రంజాన్ మాసంలో ఇదే నాకు చివరి ఉపవాసంలా ఉంది. సౌదీలో ఏజెంట్ మోసంతో నరకయాతన పడుతున్న".. అంటూ రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన ఎండి సమీర్ అనే యువకుడు తనను అదుకోవాలని వేడుతూ కేటీర్‌కు ట్వీట్ చేశాడు.
'కేటీఆర్ సారు ఈ కాపరిని కాపాడండి' - trs
సౌదీలో రాష్ట్ర వాసులు పడుతున్న కష్టాలు వీడియోల రూపంలో వెలుగుచూస్తున్నాయి. పొట్టకూటి కోసం దేశం కాని దేశం వెళ్లి నరకయాతన అనుభవిస్తున్నామని.. మీరే అదుకోవాలంటూ సమీర్ అనే యువకుడు ట్విటర్ ద్వారా కేటీఆర్‌ను కోరారు.
'కేటీఆర్ సారు ఈ కాపరిని కాపాడండి'
యువనేత స్పందన..
సమీర్ ట్వీట్‌కు స్పందించిన తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమీర్‌ను భారత్‌కు రప్పించడానికి సహకరించాల్సిందిగా భారత విదేశాంగ శాఖను కోరారు.
ఇవీ చూడండి: ఇంటర్ వివాదంపై నేడు హైకోర్టులో విచారణ