తెలంగాణ

telangana

ETV Bharat / state

మాటకు లక్ష... పాటకు మిలియన్... - views

ఇప్పటి వరకు మిలీనియల్స్​దే ప్రపంచమంతా అనుకున్నారు. రోజులు మారాయి. హైదరాబాద్​కు చెందిన  ఈ 'జనరేషన్​ వై' అమ్మాయి పేరు దివ్యాణ్వేషిత. తన టాలెంట్​ను ఫేస్​బుక్​ 'లైవ్'​ ద్వారా ప్రపంచానికి పరిచయం చేసింది. 4 లక్షల మంది ఫాలోవర్లను సంపాదించుకుని తనకిష్టమైన కళనే ప్రొఫెషన్​గా మార్చుకుంది.

మాటకు లక్ష... పాటకు మిలియన్...

By

Published : May 19, 2019, 6:04 AM IST

Updated : May 19, 2019, 6:52 AM IST

టీవీలో సత్తా చాటాలి... యాంకర్​గా నిలదొక్కుకోవాలని భావించింది ఓ పదిహేడేళ్ల యువతి. ఎలాంటి బ్యాక్​గ్రౌండ్ లేకుండా ఈ రంగంలో రాణించటం అంత సులభం కాదని త్వరగానే అర్థం చేసుకుంది. అయినా లక్ష్యం వీడలేదు. ఆన్​స్క్రీన్ అంటే టీవీయే కాదు... ఫేస్​బుక్ ద్వారా తన టాలెంట్​ను ప్రదర్శించింది. మొదటి లైవ్​కే 70వేల మంది వ్యూయర్లు. ఇప్పుడు ఫేస్​బుక్​లో తనో హీరోయిన్​. 4 లక్షల మంది అభిమానులు(ఫాలోవర్లు). తనే నగరానికి చెందిన దివ్యాణ్వేషిత. ఈ ప్రస్థానంలో ఎదురైన ఎన్నో ఇబ్బందులను సవాళ్లుగా స్వీకరించి.. విజయం దిశగా అడుగులు వేసింది. దిల్‌సుఖ్‌నగర్‌ మధురాపురీ కాలనీకి చెందిన కొమ్మరాజు దివ్య అన్వేషిత మ్యూజిక్‌లో డిప్లొమా పూర్తి చేసింది. చిన్నప్పటి నుంచి ఏదో ఒక రంగంలో రాణించి, అందరి మన్ననలు అందుకోవాలనే తపనతో సంగీతం నేర్చుకుంటూ, పాటలు పాడేది. ఫేస్‌బుక్‌లో లైవ్‌ ఆప్షన్‌ వచ్చాక, ఆమె దానిపై దృష్టి కేంద్రీకరించింది. ప్రతిరోజు సాయంత్రం ఫేస్‌బుక్‌లో లైవ్‌లోకి వస్తూ అభిమానులకు పలకరిస్తూ.. వారితో మమేకం అవుతోంది. లైవ్‌లోనే కాల్స్‌ మాట్లాడుతూ... సలహాలు, సూచనలు ఇస్తుంది. ప్రవృత్తినే వృత్తిగా మార్చుకున్న దివ్యాన్వేషిత ఈటీవీ భారత్​ ప్రతినిధి రమ్యతో తన అంతరంగాన్ని పంచుకుంది...

మాటకు లక్ష... పాటకు మిలియన్...

ఇవీ చూడండి:

Last Updated : May 19, 2019, 6:52 AM IST

ABOUT THE AUTHOR

...view details