వన్ డయాస్ సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో బెనెవాలెన్స్ అండ్ బ్యూటీ పేరిట సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మానసికంగా బాధపడుతున్న పిల్లల ప్రతిభను, వారిలో దాగిన కళను ప్రోత్సహించే విధంగా వారిని ఒకే వేదికపైకి తీసుకొచ్చింది ఈ సంస్థ. చిన్నారులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. సంప్రదాయ నృత్యాలతోపాటు పాశ్చాత్య నృత్యాలు, హంసనడకలతో అలరించారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా మానసికంగా బాధపడుతున్న వారిలో ఉల్లాసం నింపాలన్నదే తమ సంస్థ ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
ఆటపాటలతో అలరించిన చిన్నారులు - beauty
చిట్టిపొట్టి చిన్నారులు ఆటపాటలతో అదరహో అనిపించారు. వన్ డయాస్ సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ బెనెవాలెన్స్ అండ్ బ్యూటీ పేరిట సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
పిల్లలు