యూనివర్సిటీల అనుబంధ కళాశాలల గుర్తింపు ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఏఐసీటీఈ అనుమతి ఉన్నప్పటికీ... యూనివర్సిటీలు పలు కాలేజీలు, కోర్సులకు కోత విధిస్తున్నాయి. జేఎన్ టీయూహెచ్, ఓయూ, కేయూ, మహాత్మగాంధీ, శాతవాహన, పాలమూరు, తెలంగాణ, వెటర్నరీ, అగ్రికల్చరల్ యూనివర్సిటీలు వివిధ కాలేజీలు, కోర్సులకు గుర్తింపునిచ్చేందుకు కసరత్తు కొనసాగుతోంది. ఎంసెట్, ఐసెట్ ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది. ఈ నెలాఖరున కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఆ లోపు....యూనివర్సిటీలు గుర్తింపు ప్రక్రియ పూర్తి చేసి.. విద్యార్థులకు అందుబాటులో ఉండే కాలేజీలు, సీట్లను ప్రకటించే అవకాశం ఉంది.
నెలాఖరులోగా అనుబంధ కళాశాలల గుర్తింపు ప్రక్రియ...!? - undefined
త్వరలో మొదలు కానున్న విద్యా సంవత్సరానికి రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మా కోర్సుల అనుమతి ప్రక్రియ పూర్తైంది. రాష్ట్రంలోని యూనివర్సిటీల అనుబంధ కళాశాలల గుర్తింపు ప్రక్రియ త్వరలో కొలిక్కి రానుంది. ఈ నెలాఖరున కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదలయ్యే లోపు విశ్వవిద్యాలయాలు గుర్తింపు ప్రక్రియ పూర్తి చేసి.. విద్యార్థులకు అందుబాటులో ఉండే కాలేజీలు, సీట్లను ప్రకటించే అవకాశం ఉంది.
నెలాఖరులోగా అనుబంధ కళాశాలల గుర్తింపు ప్రక్రియ
ఇవీ చూడండి: దర్జాగా వచ్చాడు... ఫోనెత్తుకెళ్లాడు..
TAGGED:
aicte