తెలంగాణ

telangana

ETV Bharat / state

200 మంది అటవీ అధికారుల బదిలీ - kcr

అటవీ శాఖలో ఒకేసారి 200 మంది అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించే అధికారులను ముఖ్యప్రాంతాల్లో నియమించింది.

తెలంగాణ అటవీ శాఖ

By

Published : Feb 6, 2019, 5:28 AM IST

అడవులు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో.. నిబద్ధత, అంకితభావం కలిగిన అధికారులను నియమించాలనే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అటవీశాఖ భారీ బదిలీలకు శ్రీకారం చుట్టింది. అడవుల సంరక్షణ, అటవీ భూముల్లో చెట్ల పెంపకంపై చిత్తశుద్ధి చూపించే అధికారులను ముఖ్యమైన ప్రాంతాల్లో నియమించింది. జంగిల్ బచావో-జంగిల్ బడావో నినాదంతో అడవుల సంరక్షణ, పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని ఇటీవలే కేసీఆర్ ఆదేశించారు.

అడవులను సంరక్షించడంలో నిబద్ధత చూపిన అధికారులను తాజాగా ముఖ్యమైన ప్రాంతాలకు బదిలీ చేశారు. చీఫ్ కన్జర్వేటర్ నుంచి బీట్ ఆఫీసర్ వరకు దాదాపు 200 మంది అటవీ అధికారులు బదిలీ అయ్యారు. చీఫ్ కన్జర్వేటర్లు, కన్జర్వేటర్లు, డిఎఫ్ఓ స్థాయి కలిగిన 21 మందికి ముఖ్యమైన జిల్లాల బాధ్యతలు అప్పగించారు.

చీఫ్ కన్జర్వేటర్ ఏకే సిన్హాకు అచ్చంపేట బాధ్యతలు, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ హోదా కలిగిన శర్వానంద్, వినోద్ కుమార్​లకు మెదక్, కవ్వాల్ బాధ్యతలు అప్పగించారు. మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జనగామ, భూపాలపల్లి, ఖమ్మం, మంచిర్యాల, పాల్వంచ, కిన్నెర సాని, వరంగల్, ఖానాపూర్, నిజామాబాద్, అమ్రాబాద్, బాన్సువాడ, ఇల్లందు, కాగజ్ నగర్, ఇచ్చోడ ప్రాంతాలకు కొత్త డీఎఫ్ఓలను నియమించారు. 19 మంది రేంజ్ ఆఫీసర్లను కూడా మార్చారు. మహబూబాబాద్, గూడూరు, గంగారం, బయ్యారం, ఆజంనగర్, పెద్దపల్లి, నర్సంపేట, మంచిర్యాల, డోర్నకల్, కరీంనగర్, కొత్తగూడెం, కెరమెరి, బెల్లంపల్లి, తిర్యాని, గాంధారి, బాన్సువాడ, పిట్లం, నాగిరెడ్డిపేట, దూలపల్లికి కొత్త రేంజ్ అధికారులను నియమించారు. ఫారెస్టర్లు, బీట్ ఆఫీసర్లు కలిపి 160 మందిని బదిలీ చేశారు.

స్మగ్లర్లకు సహకరిస్తున్నారనే అభియోగాలతో 11 మంది అధికారులను అటవీశాఖ సస్పెండ్ చేసింది. వారిలో ఫారెస్ట్ డెవలప్​మెంట్​ ఆఫీసర్ స్థాయి నుంచి గార్డుల వరకున్నారు. విధినిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మరికొందరికి మెమోలు జారీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details