కరోనా కట్టడికి వ్యాపారులందరూ సహకరించాలని ఇల్లందు మున్సిపల్ ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పురపాలక సంఘం కార్యాలయంలో వ్యాపారులతో సమావేశం ఏర్పాటు చేశారు. కొవిడ్ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
'కరోనా కట్టడికి వ్యాపారులు సహకరించాలి'
కొవిడ్ కట్టడిలో భాగంగా చేపడుతున్న చర్యలకు వ్యాపారులు సహకరించాలని ఇల్లందు మున్సిపల్ ఛైర్మన్ కోరారు. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత అన్ని దుకాణాలు మూసేయాలని ఆదేశించారు. నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
వ్యాపారులు కరోనా నిబంధనలు పాటించాలి, ఇల్లందు పురపాలక సంఘం
పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటల వరకే వ్యాపార కార్యకలాపాలు కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. తర్వాత దుకాణాలు మూసేయాలని ఆదేశించారు. ఇల్లందులో కొవిడ్‌తో మరణించిన వారికి సమావేశంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సంతాపం ప్రకటించారు.
ఇదీ చదవండి:రెండు రోజుల్లో సమగ్ర నివేదిక!