భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని కిన్నెరసాని జలాశయానికి వరద నీరు పోటెత్తుతోంది. ఉదయం నుంచి నిరంతరాయంగా కురుస్తున్న వర్షం కారణంగా ఈ జలాశయానికి 12 వేల 520 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది.
కిన్నెరసాని జలాశయానికి పోటెత్తిన వరదనీరు.. 2 గేట్ల ఎత్తివేత - భద్రాద్రిలో వర్షాలు
ఎడతెరిపిలేకుండా కురుస్తోన్న వర్షాలకు కిన్నెరసాని జలశయానికి వరదనీరు పోటెత్తింది. ఉదయం నుంచి కురుసిన వర్షానికి జలశానికి 12 వేల 520 క్యూసెక్యుల వరద నీరు వచ్చి చేరింది. అధికారులు రెండు గేట్లను ఎత్తి నీటిని బయటకు విడుదల చేశారు.
కిన్నెరసాని జలాశయానికి పోటెత్తిన వరదనీరు.. 2 గేట్ల ఎత్తివేత
ముఖ్యంగా గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో కురుస్తున్న వర్షం కారణంగా ఈ జలాశయానికి భారీగా వరద నీరు పోటెత్తుతోంది. దీంతో అధికారులు రెండు గేట్లను తెరిచి ఏడువేల క్యూసెక్కుల నీటిని బయటకు విడదల చేశారు. వర్షం ప్రభావం పెరిగి వరద ఉద్ధృతి అధికమైతే మరో గేటును కూడా తెరిచే అవకాశం ఉంది.