భద్రాద్రి రామయ్య సన్నిధిలో విలాస ఉత్సవాలు కన్నుల పండువలా జరుగుతున్నాయి. వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా మొదటగా పగలు పత్తు ఉత్సవాలు... అనంతరం రాపత్తు ఉత్సవాలు నిర్వహించారు. ప్రస్తుతం విలాస ఉత్సవాలు జరుపుతున్నట్లు అర్చకులు తెలిపారు.
రామయ్య సన్నిధిలో విలాస ఉత్సవాలు - vilasa festival in bhadrachalam
భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో విలాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా విలాస ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.
రామయ్య సన్నిధిలో విలాస ఉత్సవాలు
ఉత్సవాల్లో చివరి రోజైన ఇవాళ లక్ష్మణ సమేత సీతారాములను గోదావరి నది ఒడ్డునున్న సీతా నిలయం వద్దకు తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈనెల 22న భద్రాద్రి రామయ్య సన్నిధిలో విశ్వరూప సేవ నిర్వహించనున్నారు.
ఇదీ చూడండి: ఘనంగా ప్రారంభమైన కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు