సిద్దిపేట జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామివారిని దర్శించుకోవటానికి ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. గంటలకొద్దీ క్యూలైన్లలో నిలబడి మల్లన్నను దర్శించుకున్నారు.
ఉత్సవాల్లో భాగంగా ఇవాళ పట్నంవారం కావటంతో భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఒగ్గు కళాకారులు పసుపు బియ్యంతో పట్నంవేసి... మల్లన్నకు మొక్కులు చెల్లిస్తున్నారు.
స్వామివారి దర్శనానికి తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. శివసత్తుల నృత్యాలతో ఆలయం పరిసరాలు సందడిగా మారాయి. తోట బావి వద్ద సదరు పట్నం అగ్ని గుండాలను నిర్వహిస్తుండడంతో భక్తుల రద్దీ మరింత పెరగనున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.
ఇదీ చూడండి : బస్తీమే సవాల్: పంచాయతీ కన్నా వెనుకబడ్డ జవహర్నగర్ కార్పొరేషన్