కరోనా నేపథ్యంలో భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని పలు వార్డుల్లో ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు పలువురు దాతలు సాయం అందించారు. కూరగాయల వ్యాపారి హరికృష్ణ పట్టణంలోని వార్డువార్డుకి తిరుగుతూ ఇంటింటికి వెళ్లి కూరగాయలను పంపిణీ చేశారు. మరోవైపు పట్టణంలోని పలువురు కౌన్సిలర్లు వారివారి వార్డులలోని పేదలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు అందజేస్తున్నారు.
ఇల్లందులోని నిరుపేదలకు అండగా వ్యాపారులు
భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని నిరుపేదలకు వ్యాపారులు అండగా ఉంటున్నారు. కూరగాయలు, నిత్యావసరాలు పంచుతూ తమకు చేతనైన సాయం అందిస్తున్నారు.
ఇల్లందులోని నిరుపేదలకు అండగా వ్యాపారులు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనల మేరకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని నాయకులు ప్రజలను కోరుతున్నారు.
ఇదీ చూడండి:'కాబోయే అమ్మ'పై కరోనా వైరస్ ప్రభావం