సింగరేణి వ్యాప్తంగా 15 ప్రాంతాల్లో వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో ఏరియా జీకే ఉపరితల గనిలోనూ ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు హాజరయ్యి.. ఏరియా జీఎం నరసింహారావుతో కలిసి వనమహోత్సవాన్ని ప్రారంభించారు.
జీకే ఉపరితల గనిలో వనమహోత్సవం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఏరియాలోని జీకే ఉపరితల గనిలో వనమహోత్సవం కార్యక్రమాన్ని స్థానిక శాసన సభ్యుడు వనమా వెంకటేశ్వరరావు ప్రారంభించారు. మొక్కలు నాటి పర్యావరణ సమతుల్యాన్ని కాపాడుదామంటూ ప్రతిజ్ఞ చేశారు.
జీకే ఉపరితల గనిలో వనమహోత్సవం
ఈ సందర్భంగా మొక్కలను నాటి పర్యావరణ సమతుల్యతను కాపాడాలని అధికారులు, కార్మికులు, ప్రజాప్రతినిధులు ప్రతిజ్ఞ చేశారు. పచ్చదనం ప్రాధాన్యతను వివరిస్తూ పలువురు పెద్దలు ఉపన్యసించారు. వర్షం కారణంగా కార్యక్రమం ఎక్కువ సేపు కొనసాగలేదు.
ఇవీ చూడండి:వ్యవసాయ శాఖ క్రియాశీలకంగా మారాలి: సీఎం