భద్రాద్రి రామయ్య సన్నిధిలోని చిత్రకూట మండపంలో సుమారు వెయ్యి మంది బాలికల నృత్యా భిషేకం వైభవంగా జరిగింది. బెక్కంటి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బాలికలు భక్త రామదాసు కీర్తనలకు ఒకేసారి నృత్యం చేశారు. బాలికలు చేసిన భరతనాట్యంతో ఆలయ ప్రాంతం సందడిగా మారింది. ట్రస్టు నిర్వాహకులు ఆలయంలోని వేదపండితులను ఘనంగా సత్కరించి.. నృత్య అభిషేకాన్ని ప్రారంభించారు. భద్రాచలంలో ఇవాళ, రేపు జరగనున్న బాలోత్సవ్ కార్యక్రమంలో బాల బాలికలు పాల్గొననున్నారు.
ఆకట్టుకున్న వెయ్యిమంది బాలికల నృత్యాలు - బెక్కంటి చారిటబుల్ ట్రస్ట్
భక్త రామదాసు కీర్తనలకు సుమారు వెయ్యిమంది బాలికలు నృత్యాలతో అలరించారు. భద్రాద్రిలోని రామయ్య సన్నిధిలో బెక్కంటి ఛారిటబుల్ ట్రస్ట్ వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఆకట్టుకున్న వెయ్యిమంది బాలికల నృత్యాలు