తెలంగాణ

telangana

ETV Bharat / state

భద్రాద్రి ఆలయంలో 'దొంగ'

భద్రాద్రి రామయ్య హుండీపైనే కన్నేశాడో ఘనుడు. భక్తులంతా ఉండగానే.. నగదు తస్కరిస్తున్నాడు. గమనించిన భక్తులు దొంగను పట్టుకొని పోలీసులకు అప్పగించారు.

భద్రాద్రి ఆలయంలో చోరీ విఫలయత్నం

By

Published : Feb 16, 2019, 4:43 PM IST

భద్రాద్రి రామయ్య సన్నిధిలోని హుండీలో నగదును దొంగలిస్తున్న వ్యక్తిని భక్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఉచిత దర్శనం ద్వారా ఆలయంలోకి ప్రవేశించిన వ్యక్తి హుండీలో నగదు లోపలికి వెళ్లకుండా పేపర్లను అడ్డుగా వేసి భక్తులు వేసే నగదును తస్కరిస్తున్నాడు. గమనించిన హైదరాబాద్​కు చెందిన భక్తురాలు ఆలయ పోలీసులకు సమాచారం అందించింది.

ఆలయంలోని భక్తులు పారిపోతున్న దొంగని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. హుండీలో నుంచి దొంగలించిన మొత్తాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details