ట్రాన్స్జెండర్ను పెళ్లిచేసుకున్న యువకుడు - transgender marriage
09:01 March 12
హిజ్రాను మనువాడిన యువకుడు
పెద్దలను ఒప్పించి ఓ యువకుడు, హిజ్రా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో వివాహం చేసుకున్నారు. వివరాలు.. భూపాలపల్లికి చెందిన యువకుడు రూపేశ్, ఆళ్లపల్లి మండలం అనంతోగు గ్రామానికి చెందిన హిజ్రా అఖిలకు మూడేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది.
గత 3 నెలల నుంచి ఇల్లెందు పట్టణంలోని స్టేషనుబస్తీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని సహజీవనం చేస్తున్నారు. ఇరు కుటుంబాలకు విషయం చెప్పి పెళ్లికి ఒప్పించారు. వారంతా అంగీకరించడంతో మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ వైభవంగా శుక్రవారం పెళ్లి చేసుకున్నారు.