తెలంగాణ

telangana

ETV Bharat / state

అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలి మృతదేహం లభ్యం - Boorgam paadu Latest News

వ్యవసాయ భూమిలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మొరంపల్లి బంజరు గ్రామ శివారులో చోటు చేసుకుంది.

బూర్గంపాడులో వృద్ధురాలి మృతదేహం లభ్యంబూర్గంపాడులో వృద్ధురాలి మృతదేహం లభ్యం
బూర్గంపాడులో వృద్ధురాలి మృతదేహం లభ్యం

By

Published : May 30, 2020, 12:41 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మొరంపల్లి బంజరు గ్రామ శివారులో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. సమాచారం అందుకున్న ఎస్ఐ బాలకృష్ణ ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం మృతి చెందిన మహిళను బూర్గంపాడు గౌతంపురం కాలనీకి చెందిన వృద్ధురాలు బక్కమ్మగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతురాలి పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details