తెలంగాణ

telangana

ETV Bharat / state

సువర్చల సమేత హనుమాన్ ఆలయం.. ఎక్కడుందో తెలుసా..? - ఇల్లందులో సువర్చల సహిత హనుమాన్ దేవాలయం

hanuman temple with his wife in yellandu : హనుమంతుడు బ్రహ్మచారి అనేది అందరి వాదన. ఈ మాటకు తగ్గట్టుగానే ఆంజనేయస్వామి బ్రహ్మచారిగా ఉన్న దేవాలయాలు మాత్రమే ప్రతి గ్రామంలో ఉంటాయి. ఆయన సతీమణితో ఉన్న దేవాలయం మాత్రం మనకు ఎక్కడా కనిపించదు. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సతీసమేతంగా హనుమాన్ గుడి ఉంది. సువర్చల సమేత ఆంజనేయస్వామి ఆలయం ప్రత్యేకతలేంటో తెలుసుకుందామా..?

hanuman temple with his wife
ఇల్లందులో సువర్చల సహిత హనుమాన్ దేవాలయం

By

Published : May 14, 2023, 2:33 PM IST

ఇల్లందులో సువర్చల సహిత హనుమాన్ దేవాలయం

hanuman temple with his wife in yellandu : హనుమంతుడు బ్రహ్మచారి అని కొందరి వాదన. కాదని మరి కొందరు అంటుంటారు. అయితే ఏదేమైనా ఇప్పటి వరకు మనకు తెలిసిన ఆంజనేయ స్వామి ఆలయాలన్నీ ఆయన ఒక్కడి విగ్రహంతో ఉన్నవే ఉన్నాయి. సతీసమేత హనుమాన్ ఆలయాన్ని మనం చూసి ఉండం. కానీ హనుమంతుడికి వివాహం అయిన ఇతివృత్తంతో తెలంగాణ రాష్ట్రంలోనే హనుమంతుడు తన భార్యతో ఉంది. మరి సతీసమేత హనుమాన్ ఆలయం ఎక్కడుందో తెలుసా..?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో.. శ్రీ సువర్చల సహిత అభయాంజనేయ స్వామి వారి దేవాలయం ఉంది. ఈ ఆలయాన్ని 2006 సంవత్సరంలో స్థాపించారు. ఈ గుడిలో ఆంజనేయ స్వామి వారు తన సతీమణి సువర్చలతో కొలువుదీరారు. హనుమాన్ చాలీసా పారాయణం ఇక్కడ ప్రత్యేకంగా జరుగుతుంది. ప్రతి ఏడాది హనుమాన్ జయంతి రోజు అన్ని ఆంజనేయస్వామి ఆలయాల్లో పూజలు జరుగుతంటే.. ఈ ఆలయంలో మాత్ర ఆంజనేయ స్వామి కల్యాణం నిర్వహిస్తారు. 16 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి భక్తులే కాకుండా మహారాష్ట్ర ఉత్తర్​ప్రదేశ్, మధ్యప్రదేశ్ నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలోని ఏకైక ప్రత్యేకత కలిగిన ఈ ఆలయానికి వచ్చి భక్తులు మొక్కులు చెల్లించుకుని వెళుతుంటారు.

" దేవాలయం 2006లో దీనిని నిర్మించారు. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఈ ఒక్క దేవాలయంలోనే సువర్చల సహిత హనుమాన్ కొలువై ఉన్నారు. మరెక్కడా కూడా ఇలాంటి తరహా దేవాలయం లేదు. కోరిన కోరికలు నెరవేర్చే దేవాలయం ఇది. ప్రతి వారం హనుమాన్ చాలీసా పటిస్తాం. ప్రతి హనుమాన్​జయంతి వైభవంగా నిర్వహిస్తాం. వివిధ రాష్ట్రాల నుంచి ఈ దేవాలయ దర్శనానికి భక్తులు వస్తుంటారు. పురాణాల ప్రకారం జ్యేష్ఠ మాసంలో స్వామివారి కల్యాణం జరిగింది. కానీ హనుమాన్ జయంతి రోజే ఇక్కడ సువర్చల సమేత ఆంజనేయ స్వామివారి కల్యాణం జరిపించడం ఇక్కడి ప్రత్యేకత" - శ్రీనివాసాచార్యులు, ఆలయ అర్చకులు

ఆంజనేయ స్వామి వివాహం ఎలా జరిగింది :సువర్చల దేవి సూర్య పుత్రిక. హనుమంతుడు సూర్య భగవానుడు వద్ద విద్య నేర్చుకుంటున్నప్పుడు నాలుగో వ్యాకరణాల పూర్తి చేసిన అనంతరం మరో వ్యాకరణం వివాహం అయిన వారు మాత్రమే నేర్చుకోవాల్సి ఉండడం సమస్యగా మారింది. ఆ తరుణంలో బ్రహ్మచారిగా ఉన్న హనుమంతుడికి సూర్యభగవానుడు తన కూతురు సువర్చలాదేవిని వివాహం చేసుకోవాలని సూచించడంతో హనుమంతుడు ఆమెను వివాహం చేసుకుంటాడు.

వివాహం అనంతరం ఐదవ వ్యాకరణం పూర్తి చేసిన తర్వాత సువర్చలాదేవి తపస్సుకు వెళ్లగా హనుమంతుడు మరోచోటికి తపస్సుకు వెళ్తాడు. నాటి నుంచి సువర్చల సహిత హనుమంతుడు నామకరణంతో హనుమంతుడికి పేరు పడింది. ప్రతి సంవత్సరం జేష్ట మాసం వాస్తవానికి హనుమంతుడి కల్యాణం జరగాల్సి ఉండగా ఇక్కడ మాత్రం హనుమాన్ జయంతి రోజే స్వామి వారి కల్యాణం జరపడం ఆనవాయితీగా కొనసాగుతూ వస్తుంది. 14వ తేదీన హనుమాన్ జయంతి ఆరోజు స్వామి వారి కల్యాణం జరుగుతుంది హనుమంతుడు భార్యతో కలిగే ఉన్న ప్రత్యేకత కలిగిన తెలంగాణ రాష్ట్రంలోనే ఏకైక దేవాలయం.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details