ఆంగ్ల సుదర్శన చక్రానికి తెలుగు పూజలు - ramalayam
అమెరికాలో నిర్మించబోయే రామాలయం శిఖరంపై ఏర్పాటు చేయనున్న సుదర్శన చక్రానికి భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో... అమెరికాలో నిర్మించబోయే రామాలయ శిఖరంపై ఏర్పాటు చేయనున్న సుదర్శన చక్రానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాలిఫోర్నియాలో 15 ఎకరాల్లో నిర్మిస్తున్న రామాలయంకు ఈనెల 11న శంకుస్థాపన చేశారు. శిఖర స్థాపన కోసం హైదరాబాదుకు చెందిన భక్తులు 75 కిలోల పంచ లోహాలతో సుదర్శన చక్రాన్ని తయారు చేయించారు. ఈరోజు ఉదయం భద్రాచలానికి తీసుకువచ్చి పవిత్ర గోదావరి తీరానా... శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలోనూ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భద్రాద్రి రామయ్య సన్నిధిలో లక్ష్మణ సమేత సీతారాముల ఎదుట పూజలు నిర్వహించి అమెరికాకు తీసుకెళ్తున్నారు.