భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో శృతి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారు 2 వేల మంది పేదలకు అన్నదానం నిర్వహించారు. అనంతరం పేదలకు ప్లేట్లు, దుప్పట్లు అందించారు. పట్టణ ప్రముఖులు రితీష్‌రెడ్డి కూతురు శృతి జ్ఞాపకార్థం పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఏటా తమ కూతురు శృతి పేరుతో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయటం ఎంతో ఆనందంగా ఉందని నితీశ్‌రెడ్డి తెలిపారు. పేదలు మరణిస్తే వారి అంతిమ సంస్మరణ కార్యక్రమాల నిమిత్తం ఆర్థిక సాయం కూడా అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
పేదలకు అన్నదానం... ప్లేట్లు, దుప్పట్ల వితరణ - భద్రాచలం
తన కూతురి పేరు మీద ఎంతో మంది పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహించారు భద్రాచలంలోని శృతి ఛారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు నితీశ్‌రెడ్డి. సుమారు రెండు వేల మందికి అన్నదానం చేశారు.
SRUTHI CHARITABLE TRUST DISTRIBUTED BED SHEETS AND PLATES IN BADRACHALAM