తెలంగాణ

telangana

ETV Bharat / state

టోకెన్​ ద్వారానే బియ్యం పంపిణీ... సామాజిక దూరం తప్పనిసరి - SOCIAL DISTANCE IS COMPULSORY AT RATION SHOPS IN BADRADHRI KOTHAGUDEM DISTRICT

పౌరసరఫరాల దుకాణాలకు వచ్చే లబ్ధిదారులు సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలని అధికారులు కోరుతున్నారు. కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పరిధిలో ఉన్న అన్ని చౌక ధరల దుకాణాల్లో బియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ప్రజలు టోకెన్​ ప్రకారమే దుకాణానికి రావాల్సిందిగా సూచిస్తున్నారు.

ఒకే సారి గుంపులుగా రావొద్దు : డీటీ
ఒకే సారి గుంపులుగా రావొద్దు : డీటీ

By

Published : Apr 2, 2020, 1:31 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పరిధిలోని అన్ని ప్రభుత్వ చౌక దుకాణాల్లో రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నామని ఇల్లెందు పౌర సరఫరాల ఉప తహసీల్దార్ ముత్తయ్య తెలిపారు. దుకాణాల ముందు తప్పనిసరిగా సామాజిక దూరాన్ని పాటించాలని సూచించారు. లబ్ధిదారులు ఒకేసారి గుంపులుగా రాకుండా వారికి టోకెన్ విధానాన్ని ప్రవేశపెట్టామని ఆయన పేర్కొన్నారు.

అందులోనే పూర్తి వివరాలు !

టోకెన్​లోనే ఏ సమయానికి రావాలో పూర్తి వివరాలు ఉంటాయన్నారు. ఇందుకు రేషన్ దుకాణాల్లో ప్రత్యేక వ్యక్తులను నియమించామని వెల్లడించారు. అధికారులు తెలిపిన నిబంధనలు పాటించి కరోనా వైరస్ వ్యాపించకుండా జాగ్రత్త పడాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఇస్తోన్న బియ్యం... నిత్యవసరాలు తీసుకోవాల్సిందిగా కోరారు. రేషన్ దుకాణాలకు వచ్చే వారు... సామాజిక దూరం పాటించేలా అధికారులు గుర్తులను గీశారు.

ఒకే సారి గుంపులుగా రావొద్దు : డీటీ

ఇవీ చూడండి : కరోనా చికిత్స కోసం రూ. 370 కోట్లు విడుదల

ABOUT THE AUTHOR

...view details