తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇల్లందు సింగరేణి గనిలో బొగ్గు ఉత్పత్తి పరిశీలించిన జీఎం - సింగరేణి బొగ్గు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఏరియా సింగరేణి బొగ్గు గనుల్లో బొగ్గు ఉత్పత్తి వివరాలను ఏరియా జనరల్ మేనేజర్ పీవీ సత్యనారాయణ వెల్లడించారు. ఈ ఆర్ధిక సంవత్సరం 2020-21 జులై నెలలో 4.36 లక్షల టన్నులకు గాను 1.96 లక్షల టన్నుల బొగ్గు తీసి 45 శాతం ఉత్పత్తి సాధించామని తెలిపారు.

Singareni Illandu General Manager Visits Coal mines
ఇల్లందు సింగరేణి గనిలో బొగ్గు ఉత్పత్తి పరిశీలించిన జీఎం

By

Published : Aug 2, 2020, 1:29 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఏరియాలో జనరల్​ మేనేజర్​ పీవీ సత్యనారాయణ పర్యటించారు. బొగ్గు ఉత్పత్తి పరిశీలించిన కార్మికులను అభినందించారు. 2020-2021 సంవత్సరంలో 4.36 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాల్సి ఉండగా.. 1.96 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేశామని, 45 శాతం ఉత్పత్తి పూర్తయిందని ఆయన తెలిపారు. ఏరియా మొత్తం వివిధ గనులు మరియు కోల్ హ్యాండ్ ప్లాంట్ల వద్ద జులై నెలాఖరుకు సుమారు 7.28 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయన్నారు. రోడ్డు, రైల్వే మార్గాల ద్వారా 1.80 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేశామని తెలిపారు. సమిష్టి కృషి మరియు రక్షణ చర్యలు పాటించి బొగ్గు ఉత్పత్తి చేసిన కార్మికులను, అధికారులను అభినందించారు.

అనంతరం ఇల్లందు ఏరియా 21 ఇంక్లైన్ భూగర్భ గనిలో నూతన మ్యాన్ వైండింగ్ కేజీలను మార్చే పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. కొత్త మ్యాన్ వైండింగ్ కేజీల ద్వారా ఉద్యోగులు భూగర్భములో పనిచేయుటకు ఒకసారికి 16 మందిని తీసుకెళ్లే షాఫ్ట్​ల కాలపరిమితి 10 సంవత్సరాలు ముగిసినందున వాటి స్థానంలో రెండు కొత్త మ్యాన్ వైండింగ్ కేజీ లను అమర్చినట్టు జీఎం తెలిపారు.

ఇదీ చదవండి:దేశంలో ఏ పార్టీకి లేని పటిష్ఠమైన యంత్రాంగం తెరాసకు ఉంది: కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details