తెలంగాణ

telangana

ETV Bharat / state

నిర్వాసితులకు ఉద్యోగ నియామక పత్రాల అందచేత

ఇల్లందు సింగరేణి పరిధిలోని కోయగూడెం భూనిర్వాసితులకు.. సింగరేణి యాజమాన్యం ఉద్యోగ నియామక పత్రాలను అందజేసింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.

singareni handing over employment documents to landless people in illandu koyagudem
భూనిర్వాసితులకు ఉద్యోగ నియామక పత్రాలు అందచేత

By

Published : Feb 18, 2021, 11:52 AM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సింగరేణి పరిధిలోని కోయగూడెం ఉపరితల గని అభివృద్ధిలో భాగంగా.. ఇళ్లు, భూములు కోల్పోయిన నిర్వాసితులకు, సింగరేణి యాజమాన్యం ఉద్యోగ నియామక పత్రాలను అందజేసింది. ధారపాడు గ్రామానికి చెందిన 39మంది నిర్వాసితులు.. ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకున్నారు.

ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం ఎదురు చూసిన అభ్యర్థులు.. ఆనందంతో మురిసి పోయారు. సింగరేణి యాజమాన్యానికి కృతఙ్ఞతలు తెలుపుకున్నారు.

ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆపరేషన్స్ ఎస్.చంద్రశేఖర్, జడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్య, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:న్యాయవాద దంపతుల హత్యకు... వాధించిన కేసులే కారణమా?

ABOUT THE AUTHOR

...view details