తెలంగాణ

telangana

ETV Bharat / state

పట్టాభిషిక్తుడైన రామయ్యకు వెండి రథం సేవ - telangana varthalu

భద్రాచలంలో పట్టాభిషిక్తుడైన రామయ్యకు అర్చకులు వెండి రథ సేవ నిర్వహించారు. సీతారాముల ఉత్సవ మూర్తులను వెండి రథంలో కూర్చుండబెట్టి ఆలయ అర్చకులు దీప దూప నైవేద్యాలు సమర్పించారు.

Silver chariot seva to the lord rama
పట్టాభిషిక్తుడైన రామయ్యకు వెండి రథం సేవ

By

Published : Apr 22, 2021, 8:50 PM IST

భద్రాద్రి రామయ్య సన్నిధిలో వసంత పక్ష తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు నిరాడంబరంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు భద్రాద్రి రామయ్యకు మహా పట్టాభిషేకం నిర్వహించిన అర్చకులు సాయంత్రం పట్టాభిషిక్తుడైన రామయ్యకు వెండి రథ సేవ నిర్వహించారు. ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాముల ఉత్సవ మూర్తులను వెండి రథంలో కూర్చుండబెట్టి ఆలయ అర్చకులు దీప దూప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం ప్రధాన ఆలయం చుట్టూ మూడు సార్లు చుట్టూ సేవ నిర్వహించారు.

ప్రతి ఏడాది పట్టాభిషేకం అనంతరం భద్రాద్రి రామయ్యను తిరు వీధులలో వైభవంగా పెద్ద రథంలో ఊరేగించే వారు. భక్తులంతా తిరు వీధుల్లో విహరిస్తున్న రామయ్యకు ధూప దీప నైవేద్యాలు సమర్పించే వారు. ఈ ఏడాది భక్తులు ఎవరూ లేకుండా ఆలయంలోని కొంతమంది అర్చకులతో సాదాసీదాగా నిర్వహించారు.

పట్టాభిషిక్తుడైన రామయ్యకు వెండి రథం సేవ

ఇదీ చదవండి: ఘనంగా భద్రాద్రి రామయ్య పట్టాభిషేకం

ABOUT THE AUTHOR

...view details