అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ఏపీలోని గుంటూరుకు చెందిన చల్లా శ్రీనివాసరావు, గాయత్రి దంపతులు వెండి ఇటుకను తయారు చేయించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం రామయ్య సన్నిధిలో ఆ వెండి ఇటుకకి పూజలు నిర్వహించారు.
రామమందిర నిర్మాణానికి వెండి ఇటుక
అయోధ్యలో జరుగుతున్న రామమందిర నిర్మాణానికి ఓ దంపతులు వెండి ఇటుకని కానుకగా ఇవ్వనున్నారు. భద్రాద్రి రాముని సన్నిధిలో.. పూజల అనంతరం అయోధ్యకు వెండి ఇటుకని తీసుకెళ్తామని వారు తెలిపారు.
రామమందిర నిర్మాణానికి వెండి ఇటుక
ఆ ప్రాంతంలోని భక్తుల ద్వారా రాయించిన 7 కోట్ల రామకోటి పత్రాలను భద్రాద్రి ఆలయంలో సమర్పించారు. ఆదివారం భద్రాచలంలో జరిగే నిత్య కల్యాణ మహోత్సవంలో పాల్గొని.. అనంతరం అయోధ్యకు బయలుదేరనున్నట్లు దంపతులు తెలిపారు.
ఇదీ చూడండి:'తొలి రోజు లక్షా 91వేల మందికి కరోనా టీకా'