తెలంగాణ

telangana

ETV Bharat / state

కోడి ప్రాణాలు పోతే పరిహారం ఇచ్చారు.. మా ప్రాణాలు పోతే..?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఇల్లందు ఉపరితల గని ప్రభావిత నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేశారు. బ్లాస్టింగ్ కారణంగా దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించేందుకు వచ్చిన అధికారులను అడ్డుకున్నారు.

bhadradri kothagudem latest news
ఇల్లందు ఉపరితల గని ప్రభావిత నిర్వాసితులు

By

Published : Apr 7, 2021, 4:16 AM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఉపరితల గని ప్రభావిత నిర్వాసితులు నిరసన వ్యక్తం చేశారు. బ్లాస్టింగ్ ప్రభావిత నివాసాలను పరిశీలించేందుకు వచ్చిన అధికారులను స్థానిక మహిళలు అడ్డుకున్నారు.

ఇటీవల బ్లాస్టింగ్ కారణంగా ఇల్లందు ఉపరితల గని ప్రభావిత ప్రాంతాల్లోని 16వ వార్డులో రాళ్లు పడి ఇళ్లు దెబ్బతిన్నాయి. బ్లాస్టింగ్ తీవ్రత కారణంగా రాళ్లు పడ్డ ప్రతిసారి ప్రజాప్రతినిధులు అధికారులతో రావటం.. తీవ్రత తగ్గిస్తానని చెప్పటం షరమామూలే.

పేలుళ్ల తీవ్రత తగ్గించనప్పుడు తమ నివాసాలకు పరిహారం చెల్లించాలని నిర్వాసితులు డిమాండ్ చేశారు. బ్లాస్టింగ్ సమయంలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రతకాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మొన్న బ్లాస్టింగ్ తీవ్రత కారణంగా కోడి మరణించగా నష్టపరిహారం ఇచ్చారు.. రేపు మా ప్రాణాలు పోతే నష్టపరిహారం ఇద్దామని అనుకుంటున్నారా అని నిలదీశారు.

ఇదీ చదవండి:'ఆ పది జిల్లాల్లోనే కొవిడ్​ వ్యాప్తి తీవ్రం'

ABOUT THE AUTHOR

...view details