రామయ్య సన్నిధిలో వసంతోత్సవం వేడుకలు - sitha
భద్రాద్రి రామయ్య సన్నిధిలో వసంతోత్సవం వైభవంగా నిర్వహిస్తోన్నారు. స్వామివారికి చల్లిన రంగు నీళ్లను భక్తుపై చల్లిచారు.
రంగు నీళ్లు తీసుకెళ్తూ
ఈ నెల 6 నుంచి 20 వరకు భద్రాద్రి రామయ్య సన్నిధిలో వసంత పక్ష తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా నేడు స్వామి వారికి వసంతోత్సవం వైభవంగా జరిపారు.
ముందుగా సీతారాములకు ప్రత్యేక పూజలు చేసి పసుపు కలిపిన నీళ్లను స్వామివారికి, సీతమ్మ తల్లికి, లక్ష్మణ స్వామికి చల్లారు. స్వామివారికి చల్లిన రంగు నీళ్లను భక్తులకు చల్లి వసంతోత్సవం నిర్వహించారు. అనంతరం స్వామివారిని తిరు వీధుల గుండా ఊరేగించారు.