తిరు నక్షత్రం సందర్భంగా భద్రాద్రి రామయ్యకు పునర్వసు పూజలు ఘనంగా చేశారు. ఉదయం ప్రాకార మండపంలో లక్ష్మణ సమేత సీతారాముల ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సంగీత కళాకారులు స్వామివారి కీర్తనలను ఆలపించారు. నృత్య కళాకారులు నృత్యాలు భజనలు చేస్తూ భక్తులను పరవశ్యంలో ముంచెత్తారు. సాయంత్రం గోదావరి నది వద్ద గల పునర్వసు మండపంలో లక్ష్మణ సమేత సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
భద్రాచలంలోని ఘనంగా పునర్వసు పూజలు - ramaiah
భద్రాద్రి రామయ్యకు పునర్వసు పూజలు ఘనంగా చేశారు. ప్రాకార మండపంలో లక్ష్మణ సమేత సీతారాముల ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు.
సీతారామలక్ష్మణులు