ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ఆన్లైన్ పాఠ్యాంశాల బోధన కొందరు విద్యార్థులకు అసౌకర్యాలతో అందని ద్రాక్షగా మిగిలిపోతోంది. సహజంగా వ్యవసాయ పనులు చేసుకునే కుటుంబాలు ప్రస్తుతం ఇంట్లో ఉంటున్న పెద్ద పిల్లలకు వారి చిన్నపిల్లలను అప్పగించి భార్యాభర్తలు పనులకు వెళ్తుండటం... కొన్నిచోట్ల విద్యార్థులు కూడా వ్యవసాయ పనులకు వెళ్తున్న సందర్భంలో ప్రారంభమైన ఆన్లైన్ తరగతులు కొంతమంది విద్యార్థులకు ఇబ్బందిగా మారాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాగబోయిన గూడెం పంచాయతీలో నాలుగో తరగతి విద్యార్థిని తల్లిదండ్రులు కూలిపనులకు వెళ్లగా.. ఏడుస్తున్న చిన్నారిని బుజ్జగిస్తూ టీవీలో వస్తున్న పాఠాలను వింటోంది. గిరిజన గ్రామాలు, మారుమూల ప్రాంతాల్లో విద్యార్థులు ఆన్లైన్ తరగతులపై శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. వచ్చే అర్ధగంట వారి సబ్జెక్టు బోధనలో ప్రశాంతంగా వినలేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. మరోవైపు టీవీలు లేని వారి పరిస్థితి కరోనా నేపథ్యంలో దయనీయంగా మారింది.
ఆన్లైన్ విద్య.. అవకాశం లేదు.. అర్థం కాదు! - ఆన్లైన్ బోధన
ఆన్లైన్ బోధన కొందరు విద్యార్థులకు అసౌకర్యాల వల్ల అందడం లేదు. మారుమూల గ్రామాల్లోని వ్యవసాయ కుటుంబాల్లో పరిస్థితి భిన్నంగా గోచరిస్తోంది. ఇంట్లో ఉంటున్న పెద్దపిల్లలకు చిన్నారుల బాధ్యతను అప్పగించి తల్లిదండ్రులు పనులకు వెళ్లడం వల్ల వారు చదువుపై శ్రద్ధ చూపలేకపోతున్నారు. మరోవైపు టీవీలు లేని వారి పరిస్థితి.. కరోనా నేపథ్యంలో దయనీయంగా మారింది.
ఐదు నెలల తర్వాత ప్రారంభమైన చదువులో అవాంతరాలెన్నో..